వైరల్ ఫీవర్ తో భాధపడుతున్న స్లమ్ ఏరియా అమ్మతల్లి అనే అపోహలో ఉన్న జనం.*
శ్రీకాళహస్తి పట్టణంలోని 4వ వార్డు చెంబేడు వారి కట్ట ఏనుగుల గుంట వద్ద వైరల్ ఫీవర్ సోకడం వలన అక్కడ నివసిస్తున్న పెద్దవాళ్ళు,చిన్న వాళ్ళు అనే తేడా లేకుండా ఒళ్ళంత గగుర్పుట్టే విధంగా గుల్లలతో బాధలు పడుతున్నారు.అమ్మతల్లి ఉందనే అపోహతో ఇక్కడ అందరు ఉన్నారు.ప్రక్కనే మురికి కాలువ ప్రవహించడంతో దోమలు ఎక్కువై ఒకరి నుండి మరొకరి ఈవ్యాధి వ్యాప్తి చెందుతుంది. దాదాపు 20నుండి 30 మంది దాకా వ్యాప్తి చెందివుంది. అధికారులు స్పందించి ఎంతైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.