గుంటూరు జిజిహెచ్ లో దారుణం

గుంటూరు జీజీహెచ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈసీజీ కోసం వచ్చిన యువతి పట్ల టెక్నీషియన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె చిత్రాలను సెల్‌ఫోన్‌‌లో చిత్రీకరించే యత్నం చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. యువతి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అసలు టెక్నీషియనే కాదని ఆసుపత్రి ఉన్నతాధికారులు వెల్లడించారు. అసలు టెక్నీషియన్ శంకర్ అనారోగ్యం బారిన పడటంతో అతని స్థానంలో హరీష్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆసుపత్రిలో ఘటనపై రోగుల్లో ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

గుంటూరు జిజిహెచ్ లో దారుణం