బెంగాల్‌ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత

కోల్‌కతా : తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పశ్చిమబెంగాల్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న వెంటనే దీదీ ఆస్పత్రి వద్దకు వెళ్లారు. సుబ్రతా ముఖర్జీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సుబ్రతా ముఖర్జీ ఇక లేరన్న వార్తను నమ్మలేకపోతున్నానన్నారు. ఆయన ఎంతో నిబద్ధత కలిగిన నేత అని కొనియాడారు. సుబ్రతా ముఖర్జీ మరణం తనకు వ్యక్తిగతం ఎంతో నష్టమని తెలిపారు. ఆయనలేని లోటు పూడ్చలేనిదన్నారు. గత వారంలో తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తడంతో సుబ్రతా ముఖర్జీని ఐసీయూలోకి తరలించి చికిత్స అందించినట్టు వైద్య సిబ్బంది వెల్లడించారు.

బెంగాల్‌ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత