వివిఐటిలో హీరో "కార్తీకేయ" సందడి

గుంటూరు జిల్లాలో VVIT కళాశాలలో 'శ్రీ' మూవీ మేకర్స్ పతాకం పై శ్రీసరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతూ ఆర్. ఎక్స్ 100 ఫేమ్ కార్తీకేయా కధానాయకుడిగా తాన్యారవిచందన కథానాయకగా నటిస్తున్న చిత్రం "రాజా విక్రమార్క" ఈ నెల 12న విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర ప్రచారంలో భాగంగా కథానాయకుడు కార్తీకేయా దర్శకుడు శ్రీసరిపల్లి, నిర్మాత రామారెడ్డి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ అన్ని రకాల సాంకేతిక హంగులతో రూ పుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సరిపల్లి అందరిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారని తెలిపారు. ఇప్పటికే విడుదలైన చిత్ర సంగీతంకు మంచి స్పందన లభించినదని అన్నారు. తన తొలిచిత్రం నుం డి ప్రచారంలో భాగంగా వివిఐటి సందర్శించడం పరిపాటిగా మారిందన్నారు దర్శకుడు శ్రీసరిపల్లి మా ట్లాడుతూ మంచి కధతో ప్రేక్షకులకు పరిచయం అవ్వడం సంతోషంగా ఉందని నవంబరు 12న విడుద ల కానున్న ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పై మల్లికార్జునరెడ్డి, చిత్ర యూనిట్ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.

వివిఐటిలో హీరో "కార్తీకేయ" సందడి